సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 14, 2020 , 03:25:47

రైతు వేదికలు పూర్తి చేయాలి

రైతు వేదికలు పూర్తి చేయాలి

ఇల్లంతకుంట: నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. సోమారంపేటలో నిర్మిస్తున్న రైతు వేదికను ఆదివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. అన్ని క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం పనులను పర్యవేక్షించాలని సూచించారు. వేదికల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం వెంకట్రావుపల్లిలో నూతనం గా నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు పనులను పరిశీలించారు. ప్రధాన కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఇటీవల గొల్లపల్లిలో మృతిచెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.2లక్షల విలువైన చెక్కును అందజేశారు. ఒరుపుల రాజశేఖర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించారని, బాధిత కుటుంబానికి అండ గా ఉంటామన్నారు. అనంతరం సెస్‌ డైరెక్టర్‌ గుడిసె ఐల య్య జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేసి సం బురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చింతపెల్లి వేణురావు, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ చెరుకుపెల్లి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, పీఏసీఎస్‌ చైర్మన్లు అన్నాడి అనంతరెడ్డి, రోండ్ల తిరుపతిరెడ్డి, సర్పంచులు వడ్డె ఆనందరెడ్డి, మంద సుశీల, పీఏసీఎస్‌ డైరెక్టర్లు మీసరగండ్ల అనిల్‌, చల్ల నవీన్‌రెడ్డి, తిరుపతి, నాయకులు ఎండ్ర చందన్‌, మంద లింగం, బాలాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.