సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 12, 2020 , 03:09:44

కేసీఆర్‌ నిర్ణయంపై వీఆర్‌ఏల హర్షం

కేసీఆర్‌ నిర్ణయంపై వీఆర్‌ఏల హర్షం

  • nగ్రామాల్లో వీఆర్‌ఏలు, రైతుల       ఆధ్వర్యంలో సంబురాలు
  • nకేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

గంగాధర : తెలంగాణ సర్కారు గ్రామా రెవెన్యూ సహాయకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు, పే స్కేల్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంపై మండల వీఆర్‌ఏ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా  కాలం నుంచి గ్రామాల్లో వీఆర్‌ఏ వ్యవస్థ  అమలులో ఉందని కానీ ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి సీఎం కేసీఆర్‌ సార్‌ అని ఆనందం వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పించడంపై టీఆర్‌ఎస్‌ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. మండల వీఆర్‌ఏ సంఘం సభ్యులు ఆగయ్య, మునీందర్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

రామడుగు : రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏలకు తగిన గుర్తింపునిచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మండల వీఆర్‌ఏలు కృతజ్ఞతలు  తెలిపారు. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట శుక్రవారం వీఆర్‌ఏల ఆధ్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వీఆర్‌ఏలు చేస్తున్న పనులకు ఇప్పటికి గుర్తింపు లభించిందన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు పైండ్ల సాగర్‌, మధు, కమలాకర్‌, హరీశ్‌, నర్సయ్య, మహమూద్‌, కల్యాణ్‌, నవకాంత్‌, సురేశ్‌, మనోజ్‌, లక్ష్మీరాజం, సంపత్‌, నరేశ్‌, అర్జున్‌, భూమయ్య, కనుకయ్య, పోచమల్లు, వినయ్‌ తదితరులు ఉన్నారు. 

రైతుల హర్షం

కరీంనగర్‌ రూరల్‌ : రెవెన్యూ చట్టంపై చేగుర్తి గ్రామ రైతులు శుక్రవారం సంబురాలు చేశారు. దుర్శేడ్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ బల్మూరి ఆనందరావు ఆధ్వర్యంలో రైతులు  కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నృత్యాలు చేశారు. ఈసందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌  చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు.  గ్రామంలో స్వీట్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు గాండ్ల అంజయ్య, ఎల్కపల్లి చంద్రమోహన్‌, మూల వెంకటేశంగౌడ్‌, సత్తబాలయ్య, గాండ్ల కొమురయ్య, గాండ్ల లక్ష్మీనారాయణ,కిషన్‌, బాబు, అశోక్‌, శంకర్‌, రజని, రాజేందర్‌, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. 

 చొప్పదండి : మండలంలోని దేశాయ్‌పేటలో నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్‌ మరోసారి రైతునాయకుడయ్యారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి, వార్డు సభ్యులు వెంకటరమణ, జక్కుల మధు, కొలిపాక మల్లేశం, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు సింగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, గంగస్వామి, శ్రీనివాస్‌, అశోక్‌, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.