సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 11, 2020 , 03:04:54

సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి

సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి

  • n కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌
  • n పురపాలక అధికారులతో ప్రత్యేక సమావేశం

కలెక్టరేట్‌: పట్టణ సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఆయన పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొత్త చెరువు సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆన్‌లైన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వీధి విక్రయదారులకు రుణ సాయం అందించాలని ఆదేశించారు. దివ్యాంగుల కోసం దివ్యాంగ భవన్‌ నిర్మాణానికి వచ్చే సోమవారంలోగా స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. ఘాట్‌ పక్కన, వెంకంపేటలో మోడ్రన్‌ దోబీఘాట్‌ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని, డ్రాయింగ్‌ యూనిట్‌కు స్థలాన్ని సేకరించి అందరూ ఒకేచోట పని చేసుకునే విధంగా చూడాలన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న నాలు గు మూత్రశాలలను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఎల్లమ్మ జంక్షన్‌ నుంచి కొత్త కలెక్టరేట్‌ వరకు నాలుగు లైన్‌ పనులను ప్రారంభించాలని, జంక్షన్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రోడ్లపై తిరిగే పశువులను ఒకేచోట ఉంచడం కోసం స్థల సేకరణ చేసి షెడ్డు నిర్మాణం చేయాలన్నారు. ఎల్లమ్మ జంక్షన్‌ నుంచి సాయినగర్‌ వరకు 4 కిలోమీటర్ల కరకట్ట పనులను త్వరగా ప్రారంభించాలని, మిషన్‌ భగీరథ పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని ఈనెల చివరిలోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్‌. అంజయ్య, సత్యప్రసాద్‌, కమిషనర్‌ సమ్మయ్య, ఆర్డీవో టీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.