శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 09, 2020 , 02:24:20

టీఆర్‌ఎస్‌తోనే మత్స్యకారులకు న్యాయం

టీఆర్‌ఎస్‌తోనే మత్స్యకారులకు న్యాయం

  • n జడ్పీటీసీ గీకురు రవీందర్‌
  • n ఐదు గ్రామాల సొసైటీలకు    చేప పిల్లల పంపిణీ

చిగురుమామిడి: టీఆర్‌ఎస్‌ పాలనలోనే మత్య్సకారులకు న్యాయం జరిగిందని జడ్పీటీసీ గీకురు రవీందర్‌ ఉద్ఘాటించారు. మండలంలోని సీతారాంపూర్‌ సమీకృత మత్య్స అభివృద్ధి పథకం కింద మంజూరైన ఐదు గ్రామాలకు సంబంధించి 1.20 లక్షలు చేప పిల్లలు మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మత్స్యకారుల సంక్షేమానికి 75 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, టాటా ఏసీలు, వలలు అం దించారని గుర్తు చేశారు. గతంలో హెక్టార్‌లో ఒక సభ్యుడికి మాత్రమే సభ్యత్వం ఉండేదని, కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఎకరానికి కుదించి సొ సైటీ సభ్యుల సంఖ్యను పెంచారని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నిండి మత్స్యకారులకు ఉపాధి పెరిగిందని చెప్పారు. మొదటి విడుతలో ముదిమాణిక్యం, చిగురుమామిడి, ఇందూర్తి, ఓగులాపూర్‌, ముల్కనూర్‌ గ్రామాలకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో వైస్‌ ఎం పీపీ బేతి రాజిరెడ్డి, ఎఫ్‌డీవో విజయ్‌కిరణ్‌, వివిధ గ్రామాల సర్పంచులు గోలి బాపురెడ్డి, బెజ్జంకి లక్ష్మణ్‌, సన్నీల్ల వెంకటేశం, సొసైటీ చైర్మన్లు చెరుకు సంజీవ్‌, పెసరి రాజేశం, కూన మహేందర్‌, ఎం యాదయ్య, తహసీల్దార్‌ ముబీన్‌ అహ్మద్‌, ఎంపీడీవో ఖాజా మొయినొద్దీన్‌. కార్యాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.