సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 08, 2020 , 01:31:09

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ కల్చరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకున్న భక్తుల గోత్రనామాలతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం 11,245 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, దేవాలయానికి రూ.79,500 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.