బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 06, 2020 , 02:35:30

విద్యార్థి లోకానికి ‘పూర్ణ’ గర్వకారణం

విద్యార్థి లోకానికి ‘పూర్ణ’ గర్వకారణం

  • n జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ 
  • n ఎవరెస్ట్‌ అధిరోహితకు సిరిసిల్లలో ఘన స్వాగతం
  • n బతుకమ్మ చీరల తయారీ కేంద్రం పరిశీలన

సిరిసిల్ల టౌన్‌: అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మలావత్‌ పూర్ణ విద్యార్థి లోకానికే గర్వ కారణంగా నిలిచిందని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ సౌజన్యంతో జిల్లా కేంద్రంలో తయారవుతున్న బతుకమ్మ చీరల తయారీ కేంద్రాలను శనివారం వారు మలావత్‌ పూర్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతానికి చెందిన పూర్ణ ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ఆమెలోని ఆత్మైస్థెర్యానికి నిదర్శనమని వర్ణించారు. భవిష్యత్‌లో ఐఎఎస్‌ అధికారిగా సేవలు అందించాలన్న తన లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. మలావత్‌ పూర్ణ మాట్లాడుతూ, ఎవరెస్ట్‌తో పాటు ఇప్పటివరకు ప్రపంచంలోని ఆరు ఎత్తైన పర్వతాలను అధిరోహించానని తెలిపారు. తన ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల వ్యవసాయ భూమితోపాటు ఇంటిని మంజూరు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అనంతరం జడ్పీ క్యాంపు కార్యాలయంలో అధ్యక్షురాలు అరుణ, మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, జడ్పీటీసీ గుగులోత్‌ కళావతి పూర్ణను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌బీస్‌ఎస్‌ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు ఒజ్జల అగ్గి రాములు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ సురేశ్‌నాయక్‌, రంజిత్‌ పాల్గొన్నారు. 

వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.