ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 04, 2020 , 02:08:18

రవాణా సమస్యలు పరిష్కారం

రవాణా సమస్యలు పరిష్కారం

  • n కొదురుపాక నుంచి వెంకట్రావ్‌పల్లి వరకు నాలుగు వరుసల రహదారి
  • n 11 కోట్లు మంజూరు
  • n టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్‌రావు

బోయినపల్లి: కరీంనగర్‌ నుంచి కొదురుపాక మీదుగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ రహదారి రవాణా సమస్య పరిష్కారం కానున్నదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన బోయినపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రహదారిలో ఇక ట్రాఫిక్‌ జామ్‌ కాదని, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం లేదన్నారు.. కొదురుపాక నుంచి వెంకట్రావ్‌పల్లి వరకు మంజూరైన నాలుగు వరుసల బీటీ రహదారికి రోడ్డు భవనాల శాఖ 11 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సమైక్య పాలనలో శాభాష్‌పల్లి మినీ వంతెనపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి నోచుకోలేదన్నారు. వేములవాడ రాజ న్న ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తుండగా, సింగిల్‌ బీటీ రహదారితో ప్రతి వారం ప్ర మాదాలు జరిగేవని చె ప్పారు. స్వరాష్ట్రంలో ప్రజ లు రవాణా సమస్యలు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కరీనంనగర్‌ నుంచి ఇప్పటికే రెండు వరుసల బీటీ రహదారి, శాభాష్‌పల్లి హైలెవల్‌ వం తెన నిర్మాణం చేపట్టిందన్నారు. బావుపేట నుంచి కరీంనగర్‌ వరకు నాలు గు వరుసల రహదారి పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కొదురుపాక నుంచి వెంకట్రావ్‌పల్లి వరకు నాలుగు వరుసల బీటీ రహదారికి ఆర్‌అండ్‌బీ నుంచి 11కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఉమ్మడి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అభినందించారు.