మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Sep 03, 2020 , 01:46:00

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

  • ఒకరి అరెస్ట్‌ n 50 క్వింటాళ్ల బియ్యం, వాహనం స్వాధీనం

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులో బుధవారం రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో జిల్లెల్ల శివారులో బియ్యాన్ని తరలిస్తున్న ట్రాలీ ఆటోను పట్టుకున్నారు. ఆటోను తనిఖీ చేయగా, 50క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. బియ్యంతోపాటు వాహనం, డ్రైవర్‌ రాజును తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు. తదుపరి విచారణ కోసం ఠాణాలో అప్పగించామని టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సత్తయ్య తెలిపారు. దాడుల్లో కానిస్టేబుళ్లు రమేశ్‌, తిరుపతి ఉన్నారు.