మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Sep 02, 2020 , 02:48:24

ప్రణబ్‌ మృతి దేశానికి తీరని లోటు

ప్రణబ్‌ మృతి దేశానికి తీరని లోటు

  • lకోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు  lటీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద సంతాప కార్యక్రమం

మెట్‌పల్లి టౌన్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు పేర్కొన్నారు. అనారోగ్యంతో ప్రణబ్‌ ముఖర్జీ మరణించగా మంగళవారం టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఎదుట సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాణవేని సుజాతతోపాటు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల మాట్లాడుతూ, ప్రణబ్‌ ముఖర్జీ 13వ రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలందించారని, అనేక చట్టాల రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేం ద్ర మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించా రు. కార్యక్రమంలో వైద్యులు రాణవేని సుజాత, కౌన్సిలర్‌ మర్రి సహదేవ్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఏశాల రాజశేఖర్‌, మున్సిపల్‌ మాజీ ఉపాధ్యక్షుడు మార్గం గంగాధర్‌, నాయకులు పిప్పెర రాజేశ్‌, వేముల ప్రభాకర్‌, నాగభూషణం, ఎండీ జావీద్‌, షేక్‌ మహ్మద్‌, సత్తయ్య గౌడ్‌, బత్తుల భరత్‌, జాజాల రాజుగోపాల్‌  పాల్గొన్నారు.