శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 01, 2020 , 02:25:20

సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు

సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు

  •  nఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  •  nగంగాధరలో కల్యాణలక్ష్మి       చెక్కుల పంపిణీ

గంగాధర: కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 94 మంది లబ్ధిదారులకు రూ. 93 లక్షల 77 వేల 788 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, సర్పంచులు కంకణాల విజేందర్‌రెడ్డి, ఆకుల శంకరయ్య, ముక్కెర మల్లేశం, వేముల దామోదర్‌, అలువాల నాగలక్ష్మి, దోర్నాల హన్మంతరెడ్డి, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్‌, అలువాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ మండలాధ్యక్షుడి కుటుంబానికీ చెక్కు

గట్టుభూత్కూర్‌ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు మల్కాపురం రాజేశం కూతురు కల్యాణి వివాహం చేసి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోగా, లక్షా 116 రూపాయలు మంజూరయ్యాయి. ఈ మేరకు చెక్కును రాజేశం భార్య రాజేశ్వరికి ఎమ్మెల్యే అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సాయం అందడంపై రాజేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.