ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 31, 2020 , 01:03:10

ప్రజా నాయకుడు రాజేశ్వర్‌రావు

ప్రజా నాయకుడు రాజేశ్వర్‌రావు

వేములవాడ: సాయుధ రైతాంగ పోరాట యోధుడు,  మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు గొప్ప ప్రజా నాయకుడు అని వేములవాడ మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు పేర్కొన్నారు. ఆదివారం రాజేశ్వర్‌రావు 97వ జయం తి సందర్భంగా తెలంగాణ చౌక్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిస్వార్థ ప్రజా సేవకుడిగా రాజేశ్వర్‌రావు ఎనలేని పేరు ప్రఖ్యాతలు సాధించారని పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయాల్లోనే ఒక ముద్ర వేశారన్నారు. మెట్ట ప్రాంతాలైన వేములవాడ, సిరిసిల్లకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలన్న ఆయన ఆకాంక్షను అతడిన తనయుడు రమేశ్‌బాబు సాకారం చేశారని గుర్తుచేశారు. సెస్‌ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు మారం కుమార్‌, బింగి మహేశ్‌, కో ఆప్షన్‌ సభ్యులు కట్కూరి శ్రీనివాస్‌, నాయకులు పీచర భాస్కర్‌రావు, ప్రసాద్‌రావు, అన్నారం శ్రీనివాస్‌, నీలం శేఖర్‌, పెంట బాబు, కొండ నర్సయ్య, మల్లేశం ఉన్నారు. 

రుద్రంగి: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు జయంతిని నిర్వహించారు. జడ్పీటీసీ గట్ల మీనయ్య, పార్టీ నాయకులతో కలిసి రాజేశ్వర్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ కేసీరెడ్డి నర్సారెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు దయ్యాల కమలాకర్‌, నాయకులు కొమురె శంకర్‌, చెప్యాల గణేశ్‌, పిడుగు లచ్చిరెడ్డి, కొడగంటి శ్యాం, మారంపెల్లి రాజ్‌కుమార్‌, పూదరి శ్రీనివాస్‌, నేరెళ్ల శేఖర్‌, ఎర్రం నవీన్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.