గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 30, 2020 , 02:24:51

పేదల కుటుంబాల్లో వెలుగులు

పేదల కుటుంబాల్లో వెలుగులు

  • lఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
  • lచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • l90మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

బోయినపల్లి: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శనివారం ఆయన 90 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.90.10 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో ఉండాలని సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా రూ.లక్షానూటపదహార్లు ఆర్థిక సాయం అందజేస్తున్నారని కొనియాడారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 70ఏళ్ల పాలనలో సమైక్య పాలకులు దోచుకోవడానికి, దాచుకోవడానికి మాత్రమే సరిపోయిందని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సర్పంచులు అతికం లచ్చయ్యగౌడ్‌, బూర్గుల నందయ్య, ఇల్లందుల శంకర్‌, వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, చిందం రమేశ్‌, కోరెపు నరేశ్‌, గుంటి లతశ్రీ, ఎంపీటీసీలు కంకణాల వనజ, అక్కెనపల్లి ఉపేందర్‌, ఐరెడ్డి గీతా, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేడుదుల మల్లేశం, నాయకులు కత్తెరపాక కొండయ్య, కొప్పుల స్వామి, గుంటి శంకర్‌, కవంపల్లి రాములు, ఈడ్గు స్వామి, రంగి తిరుపతి ఉన్నారు.