శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 29, 2020 , 02:23:30

రాజన్న ఆలయంలో రద్దీ

రాజన్న ఆలయంలో రద్దీ

  •  2,350మంది రాక n సమకూరిన 1.21లక్షల ఆదాయం

వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో రద్దీగా కనిపించింది. కరోనా వ్యాప్తికి ఎలాంటి అవకాశం లేకుండా ఆలయ అధికారులు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. డిసిన్ఫెక్షనల్‌ టన్నెల్‌ నుంచి భక్తులు ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 2,350 మంది భక్తులు దర్శించుకోగా, వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు 1.21లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.