మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 28, 2020 , 02:34:38

‘విట్స్‌'లో హరితహారం

 ‘విట్స్‌'లో హరితహారం

కరీంనగర్‌ రూరల్‌: నగర శివారులోని బైపాస్‌ రోడ్డులో గల విట్స్‌ కళాశాల ఆవరణలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం హరితహారం  కార్యక్రమం నిర్వహించారు.  సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు  కళాశాల ప్రాంగణంలో సుమారు 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణారెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ బి గోవిందరావు, ఏవో సాగి సుధాకర్‌రావు, డీన్‌ ప్రదీప్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి స్టాలిన్‌, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

బొమ్మకల్‌లో మొక్కలు పంపిణీ

బొమ్మకల్‌ నాల్గొ వార్డు ప్రజలకు వార్డు సభ్యుడు తోట కిరణ్‌కుమార్‌ 350 పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.