శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 27, 2020 , 02:38:45

ప్రతి ఇల్లూ ఆవిష్కరణలకు వేదికవ్వాలి

ప్రతి ఇల్లూ ఆవిష్కరణలకు వేదికవ్వాలి

  • n  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌
  • n  ఇంటింటా ఇన్నోవేషన్‌కు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

వేములవాడ/కలెక్టరేట్‌: ప్రతి ఇల్లూ కొత్త ఆవిష్కరణలకు వేదికవ్వాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేషన్‌కు ఎంపికైన విద్యార్థులకు (బి.సరయు, నవీన్‌కుమార్‌, వి.మహేశ్‌చంద్ర) బుధవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇన్నోవేషన్‌, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్‌ ఆన్‌లైన్‌ ఆవిష్కరణల ప్రదర్శనలు ఏర్పాటు చేసిందన్నారు. యువతీ యువకుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఔత్సాహికుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 16 దరఖాస్తులు రాగా, అందులో మూడు ఇన్నోవేషన్లకు ఆన్‌లైన్‌ ఆవిష్కరణల ప్రదర్శనలో చోటు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్‌, డీపీఆర్వో మామిండ్ల దశరథం, జిల్లా సైన్స్‌ అధికారి ఆంజనేయులు తదితరులు ఉన్నారు. కాగా, విద్యార్థిని సరయును కిడ్స్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ దరక్షన్‌ వస్‌ఫియా, కరస్పాండెంట్‌ నరాల దేవేందర్‌, డైరెక్టర్‌ ఫసి అభినందించారు.