శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 26, 2020 , 02:24:39

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

హుజూరాబాద్‌:  సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కేసీక్యాంపులోని మంత్రి కార్యాలయంలో 103 మంది లబ్ధిదారులకు రూ.31లక్షల 34వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బక్కారెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. సర్కారు అమలు చేస్తున్న పథకాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పేదల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనంతోనే మానవ మనుగడ సాధ్యమని, హరితహారం విజయవంతం కోసం సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు ఇరుమళ్ల సురేందర్‌ రెడ్డి, రాపర్తి శివ తదితరులు పాల్గొన్నారు.