బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 26, 2020 , 02:24:43

ఆస్తి పన్ను చెల్లించండహో..!

ఆస్తి పన్ను చెల్లించండహో..!

  •  l జోరుగా మున్సిపాలిటీ ప్రచారం
  •  l ఓటీఎస్‌తో 90 శాతం రాయితీ
  •  l సెప్టెంబర్‌15 వరకు ప్రత్యేక మేళా

ధర్మపురి: ఆస్తి పన్నులు చెల్లించండహో..అంటూ ధర్మపురి మున్సిపాలిటీ విస్తృత ప్రచారం చేస్తున్నది. వాహనాలను ఏర్పాటు చేసి మైకుల ద్వారా వడ్డీ బకాయిలపై ఇస్తున్న రాయితీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి పన్నుల వసూలుతో పాటు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక మేళాను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 15 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో ఇంటి పన్నుల సమస్యల పరిష్కార సదస్సు పేరిట ఈ మేళా నిర్వహిస్తున్నారు.

ఓటీఎస్‌తో వడ్డీ బకాయిలపై 90 శాతం రాయితీ..

ఆస్తిపన్ను వడ్డీ బకాయిలపై 90 శాతం మాఫీని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం వన్‌టైమ్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌)ను సెప్టెంబర్‌ 15వరకు అమలు చేస్తున్నది.  ఆస్తి పన్ను కట్టి రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బకాయిదారులకు నోటీసులు, మెసేజ్‌ల రూపంలో సమాచారమందించారు.

సదస్సులో పరిష్కారం..

ఇంటి పన్ను సమస్యల పరిష్కారం కోసం చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పన్ను ఎక్కువగా వేస్తున్నారని, పేర్లు తప్పుగా నమోదయ్యాయని, ఇలా రకరకాల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పన్నులు  సరిగా వసూలు కావడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది. సమస్యలుంటే పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. 

ఇంటి  పన్ను విషయంలో హెచ్చు తగ్గులు, ఇంటి కొలతల్లో అభ్యంతరాలు, ఇంటి పన్ను ఆన్‌లైన్‌లో ఎంట్రీ, ఇంటి పన్ను బకాయి ఉండి కట్టని వారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద పన్ను వడ్డీపై 90శాతం మాఫీ, ఆన్‌లైన్‌ తప్పులు సరిచేసుకోవడం, ఇల్లు రిజిస్ట్రేషనయి పేరుమార్పిడి చేసుకోకపోవడం, ఇంటి నంబర్‌ను సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా పొందుట, ఇంటి పన్నుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు.

సదస్సుకు తీసుకురావాల్సిన పత్రాలు..

గతంలో చెల్లించిన ఇంటి పన్ను రశీదు, రిజిస్ట్రేషన్‌ లింక్‌ డాక్యుమెంట్లు, ఈసీ, ఇంటి ఫొటో, ఇంటి పర్మిషన్‌ ప్రతి(అనుమతి ఉన్నచో)