మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 26, 2020 , 02:24:45

ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలి

ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలి

కార్పొరేషన్‌ :  ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలని కలెక్టర్‌ శశాంక జిల్లా ప్రజలను కోరారు.  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్లతో ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిల వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. వన్‌టైం స్కీం కింద ఆస్తి పన్ను బకాయిలపై కేవలం పదిశాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను మొత్తంతో పాటు పదిశాతం వడ్డీ చెల్లిస్తే మిగతా 90 శాతం మాఫీ చేయనున్నట్లు తెలిపారు. దుకాణాల లైసెన్సులు, వాటి డాటా సరి చేయడం, కమర్షియల్‌ మీటర్ల వెరిఫికేషన్‌ చేయాలన్నారు. మున్సిపల్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ 360 ప్రకారం టెలిఫోన్‌, విద్యుత్‌ బిల్లు, కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ అని ఇంటి నంబర్‌తో చెక్‌ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో మేయర్‌ సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి, టెక్నికల్‌ హెడ్‌ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.