సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 24, 2020 , 01:39:13

మత్స్యకారుల అభివృద్ధే సీఎం లక్ష్యం

మత్స్యకారుల అభివృద్ధే సీఎం లక్ష్యం

ముస్తాబాద్‌:  మత్స్యకారుల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎంపీపీ జనగామ శరత్‌రావు పేర్కొన్నారు.  మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పెద్ద చెరువులో ఆదివారం ప్రజాప్రతినిధులు, మత్స్య శాఖ అధికారులతో కలిసి 48వేల చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, గతంలో ఎడారిగా మారిన చెరువులు, కుంటలు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జలకళ సంతరించుకున్నాయని తెలిపారు. దేశంలో కుల వృత్తులకు చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు అందరూ రుణపడి ఉండాలన్నారు. గూడెం సొసైటీ, ముస్తాబాద్‌, నామాపూర్‌, గూడెం, ఆవునూర్‌, కొండాపూర్‌, చిప్పలపల్లి చెరువుల్లో వదిలేందుకు మత్స్య కార్మికులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌ కృషితోనే మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారని జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు పేర్కొన్నారు.  కార్యక్రమంలో సర్పంచు గాండ్ల సుమతి, ఉప సర్పంచ్‌ వేముల రవీందర్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ఉల్లి మల్లేశ్‌ యాదవ్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రావు, సురేందర్‌రావు, సర్వర్‌పాషా, సంతోష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, పారిపెల్లి శ్రీనివాస్‌, భరత్‌, దేవేందర్‌, నర్సింహా రెడ్డి, రమేశ్‌రెడ్డి, సత్యం, అధికారులు, మత్స్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

వీర్నపల్లి : మండలంలోని వెంకట్రాయినీ చెరువులో కంచర్ల ముదిరాజ్‌ కులస్థులు ఆదివారం చేప పిల్లలను విడుదల చేశారు. రూ.లక్ష వ్యయం గల చేప పిల్లలను చెరువులో వదిలినట్లు మత్స్య కార్మికులు తెలిపారు.