గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 24, 2020 , 01:39:14

నిరాడంబరంగా వినాయక నవరాత్రులు

నిరాడంబరంగా వినాయక నవరాత్రులు

సిరిసిల్లలో 15నుంచి 25 అడుగుల వినాయక ప్రతిమలు దాదాపు 300లకు పైనే ఏర్పాటు చేసేవారు. ఈసారి నాలుగు అడుగులకు మించి ప్రతిమలను ఏర్పాటు చేయలేదు.  వాతావారణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. చాలా మంది ఇళ్లల్లో మట్టి గణపతులతో పూజలు చేశారు. మట్టి గణపతులను ఇంటింటా పంపిణీ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు పోటీపడ్డాయి. ఉచితంగానే వినాయకులను పంపిణీ చేశారు. చాలా మండపాల్లో సైతం మట్టి గణపతులనే ఏర్పాటు  చేశారు.

సిరిసిల్ల కల్చరల్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయకులను శనివారం ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు కట్టెకోల శివశంకర్‌, గుగ్గిళ్ల జగన్‌గౌడ్‌,బుడిమె శివప్రసాద్‌,లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి  నంగునూరి శ్రీకాంత్‌, కోశాధికారి కమతాల అనిల్‌, ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి, సభ్యులు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

వేములవాడ: యువ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం వద్ద శనివారం పర్యావరణ హిత మట్టి గణపతులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు గడ్డం ప్రశాంత్‌, తడుక గణేశ్‌, ఎండ్రాల మహేశ్‌, బండి సాయికిరణ్‌, తాళ్లపల్లి వినయ్‌, అస్లాం, తదితరులు ఉన్నారు. 

వీర్నపల్లి : వినాయక చవితి ఉత్సవాలు దుబాయక్‌లో శనివారం నిర్వహించారు. ఎల్‌ఎస్‌పీఎంకే సంస్థ ప్రధాన కార్యాలయం, లేబర్‌ క్యాంపులో వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. సత్యంతోపాటు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధారపు సత్యం, ఉద్యోగులు పూజలు చేశారు. ఇందులో సీఈవో శ్యాంరెడ్డి, చంద్రమౌళి, అజయ్‌, అనిల్‌, నవీన్‌, మల్లేశం ఉన్నారు.

రుద్రంగి: మండలంలోని గ్రామాల్లో ప్రజలు శనివారం భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు జరిపారు. ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు.

వేములవాడ రూరల్‌ : వేములవాడ, వేములవాడ రూరల్‌ మండలాల్లో కొవిడ్‌ 19 నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వీధుల్లో కాకుండా కేవలం కుల సంఘాల భవనాలు, ఆలయాల్లో మాత్రమే గణపతులను ఏర్పాటు చేశారు. తక్కువ సంఖ్యలో గణపతులు ఏర్పాటు చేశారు. 

కోనరావుపేట : మండలంలోని వట్టిమల్ల, మా మిడిపల్లి, కోనరావుపేటతోపాటు పలు గ్రామాల్లో వినాయకులు కొలువుదీరాయి. భక్తులు వినాయకుల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం వి నాయకుడి వద్ద భజన సంకీర్తనలు చేశారు.

బోయినపల్లి: మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో శనివారం వినాయకులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.