శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 22, 2020 , 01:36:57

మట్టి ప్రతిమలే ప్రతిష్టించాలి

మట్టి ప్రతిమలే ప్రతిష్టించాలి

కలెక్టరేట్‌: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట్లో మట్టితో చేసిన విగ్రహాలను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వెయ్యి ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ స్టాల్‌ను శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ ఆవరణలో ప్రారంభించి, మాట్లాడారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో జల కాలుష్యం పెరిగి మానవాళికి ముప్పు వాటిల్లుతున్నదన్నారు. మట్టి ప్రతిమలను ప్రతిష్టించేందుకు ప్రజలు ఆసక్తిచూపాలని కోరారు. కొవిడ్‌ నేపథ్యంలో పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో అదనపు కలెక్టర్‌ అంజయ్య, శిక్షణ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌, తహసీల్దార్‌ అంజన్న, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు గంగయ్య ఉన్నారు.

విత్తన గణపతినే ప్రతిష్టించుకోవాలి

బోయినపల్లి: ఇంటింటా విత్తన గణపతినే ప్రతిష్టించుకోవాలని జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు శుక్రవారం ఆమె స్థానిక ప్రజాప్రతినిధులతో మండల కేంద్రంలో విత్తన గణపతులను పంపిణీ చేసి, మాట్లాడారు. ఆధ్యాత్మికత, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్‌కుమార్‌ విత్తన గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇందులో సర్పంచులు బూర్గుల నందయ్య, గుంటి లతశ్రీ, వంగపల్లి సత్యానారాయణరెడ్డి, కన్నం మధు, అతికం లచ్చయ్యగౌడ్‌, నరేశ్‌, చిందం రమేశ్‌, ఇల్లందుల శంకర్‌, ఓంటెల గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు కంకణాల వనజ, సంబ బుచ్చమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేడుదుల మల్లేశం, నాయకులు కత్తెరపాక కొండయ్య, అనుముల భాస్కర్‌, కొప్పుల స్వామి, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్‌, ఈడ్గు స్వామి, పురుశోత్తంరెడ్డి, కవంపల్లి రాములు, ఏఎంసీ డైరెక్టర్‌ అనిల్‌, సంజీవ్‌ ఉన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్టించవద్దు

నవరాత్రోత్సవాల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించవద్దని వేములవాడ రూరల్‌ సీఐ నవీన్‌కుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రజాప్రతినిధులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహలను ప్రతిష్టించడం నిషేధమని పేర్కొన్నారు. ఇందుకు ప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు సహకరించాలని కోరారు. ఏఎస్‌ఐ చంద్రమౌళి, సర్పంచులు రమేశ్‌, నందయ్య, లచ్చయ్య, గోపాల్‌రెడ్డి, సత్యానారాయణరెడ్డి, నరేశ్‌, శంకర్‌ ఉన్నారు.

ఇళ్లలోనే జరుపుకోవాలి

చందుర్తి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి పండగను ఇళ్లలోనే జరుపుకోవాలని చందుర్తి సీఐ మొగిలి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టవద్దన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్‌ఐ సునీల్‌ ఉన్నారు. మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహలు పంపిణీ చేశారు. 

మూషికవాహన.. మాస్క్‌ధారణ

వేములవాడ కల్చరల్‌: కరోనా విఘ్నాలు తొలగించేందుకు ఎలుకపై ఊరుగుతూ విచ్చేస్తున్న గణానాథుడు సైతం కొవి డ్‌ బారినపడకుండా చర్యలు చేపడుతున్నారు. తొండానికి మాస్క్‌ ధరించి, ఒక చేతిలో శానిటైజర్‌తో వస్తున్న పార్వతీనందనుడికి భక్తులు సాదర స్వాగతం పలుకుతున్నారు. 

ఆదర్శం.. ఈ ఉపన్యాసకుడు

ఎల్లారెడ్డిపేట: సింగారం గ్రామానికి చెందిన ఉపన్యాసకు డు పరశురాములు కుటుంబ సభ్యులతో కలిసి మట్టి ప్రతిమలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మట్టి వినాయకుల అవసరం తెలిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిమలను తయారు చేస్తున్నట్లు పరశురాములు తెలిపారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా 500 ప్రతిమలు తయారుచేసినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలకు వంద విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూ మట్టి ప్రతిమల వినియోగంపై ప్రచారం చేస్తున్నాడు.

లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రతిమల పంపిణీ

ఎల్లారెడ్డిపేటలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 108 మట్టి ప్రతిమలను పంపిణీచేశారు. లయన్స్‌ క్లబ్‌ మండలాధ్యక్షు డు మాద లక్ష్మీనారాయణ, కార్యదర్శి బోయిని మహాదేవ్‌, కోశాధికారి శ్రీగాద శ్రీనివాస్‌, సభ్యులు నంది కిషన్‌, దుంపెన రమేశ్‌, పిల్లి రవి, పయ్యావుల రామచంద్రం, ము త్యాల కిష్టారెడ్డి, తొగిటి స్వామి, సద్ది లక్ష్మారెడ్డి ఉన్నారు.

కోనరావుపేట: బావుసాయిపేట జీపీ కార్యాలయంలో యువకులతో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వినాయక ప్రతిమలను ఇంట్లో ప్రతిష్టించుకోవాలన్నారు. సర్పంచ్‌ గంగాధర్‌ ఉన్నారు.

గంభీరావుపేట: మండల కేంద్రంలోని 300మందికి మట్టి  విగ్రహాలను టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి అందజేశారు. మట్టి ప్రతిమలను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందామని వారు పేర్కొన్నారు.