శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 21, 2020 , 02:14:15

పరిహారం అందేలా చూస్తాం..

పరిహారం అందేలా చూస్తాం..

  • n  అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌
  • n  శంకరపట్నం మండలంలో పర్యటన
  • n  వర్షాలతో పలుచోట్ల కూలిన ఇండ్లు, నీట మునిగిన పొలాలు

శంకరపట్నం: వర్షాలతో నష్టపోయిన వారెవరూ అధైర్యపడవద్దని, పరిహారం అందేలా చూస్తామని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన శంకరపట్నం మండలంలోని తాడికల్‌, అంబాల్‌పూర్‌, వంకాయగూడెం, కేశవపట్నం గ్రామాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు తాడికల్‌ వద్ద కల్వర్టు దెబ్బతినడంతో అక్కడ చేపడుతున్న తాత్కాలిక మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో పంట నష్టం ఎంత విస్తీర్ణంలో ఉంటుందని శ్యాంప్రసాద్‌లాల్‌ తహసీల్దార్‌ జగత్‌సింగ్‌ను అడుగగా, వర్షాలు తగ్గిన తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తామని బదులిచ్చారు.  అంబాల్‌పూర్‌ ఊర చెరువును పరిశీలించారు. అలాగే కేశవపట్నం, వంకాయగూడెం గ్రామాల్లో కూలిన ఇండ్లను పరిశీలించారు. వర్షాల కారణంగా నష్టపోయిన వారికి తగిన సహాయం అందజేస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్‌ వెంట హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలోం, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ జగత్‌సింగ్‌, ఏవో శ్రీనివాస్‌, గిర్దావర్‌ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట మహిపాల్‌, నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, బుద్ధార్థి సంపత్‌, బండారి తిరుపతి, బొజ్జ కోటిలింగం, తదితరులు ఉన్నారు. అలాగే కేశవపట్నం వాగుతో పాటు తాడికల్‌, ముత్తారం, ఎరడపల్లి, అర్కండ్ల, గద్దపాక, కాచాపూర్‌, ఆముదాలపల్లి, మెట్‌పల్లి, లింగాపూర్‌లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. 1500 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఏవో శ్రీనివాస్‌ వెల్లడించారు. భారీ వర్షాలకు ఇప్పటి వరకు మండలంలో 70 ఇండ్లు కూలినట్లు తహసీల్దార్‌ జగత్‌సింగ్‌ తెలిపారు. 

మానకొండూర్‌: మండలవ్యాప్తంగా దాదాపు 800 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. ఇందులో  220 ఎకరాల్లో  వరిపంట పూర్తిగా ఇసుక మేటలతో నిండిపోగా పత్తి, మక్క పంటలకు నష్టం జరిగినట్లు వివరించారు.  

గన్నేరువరం: పారువెల్ల, జంగపెల్లి, మైలారం చెరువులు, గునుకులకొండాపూర్‌లోని పటేల్‌ చెరువు, మల్లికార్జున కుంట మత్తడి దుంకుతున్నది. మైలారం గ్రామంలోని జాలు కాల్వ వరదను ఎంపీపీ లింగాల మల్లారెడ్డి పరిశీలించారు. ఇక్కడ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పురంశెట్టి బాలయ్య, నాయకులు దుడ్డు మల్లేశం, వరాల మల్లేశం, దుడ్డు పర్శరాములు, మైసంపెల్లి మల్లేశం తదితరులు ఉన్నారు. కాగా వర్షాలకు మండలంలో 6 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. కూలిన ఇండ్లను ఆర్‌ఐ కరుణాకర్‌, గునుకులకొండాపూర్‌  ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు పరిశీలించారు. వీరివెంట  టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు న్యాలపట్ల శంకర్‌ గౌడ్‌, స్వేరోస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు హన్మాండ్ల యాదగిరి, గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు న్యాలపట్ల పర్శరాములు, వార్డు సభ్యులు న్యాలపట్ల లక్ష్మణ్‌, నాగపురి శంకర్‌, బో యిని సమ్మయ్య, నాయకలు అందె సంపత్‌, న్యాలపట్ల తిరుపతి తదితరులు ఉన్నారు.

మానకొండూర్‌ రూరల్‌: బుధవారం రాత్రి వర్షానికి కొండపల్కల గ్రామానికి చెందిన పులి మల్లయ్య గుడిసెలోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న గ్రామ రైతుబంధు కన్వీనర్‌ కడారి ప్రభాకర్‌, సర్పంచ్‌ నల్లా వంశీధర్‌రెడ్డి  తహసీల్దార్‌ రాజయ్యకు సమాచారమందించారు. వెంటనే తహసీల్దార్‌ పాఠశాల హెచ్‌ఎంతో మాట్లాడి ఓ తరగతి గది ని పులి మల్లయ్య కుటుంబానికి అందజేశారు. బాధిత కు టుంబ  సభ్యులు, గ్రామస్తులు, రెవెన్యూ సిబ్బంది గట్టు అనిల్‌, బండ రాజు, గట్టు కొమురయ్య సామగ్రిని పాఠశాలలోకి మార్చారు.  

తిమ్మాపూర్‌: వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని కోరుతూ సీపీఎం మానకొండూర్‌ జోన్‌ ఇన్‌చార్జి సుంకరి సంపత్‌, మండల కార్యదర్శి మాతం గి శంకర్‌ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు. 

చిగురుమామిడి: ఇందుర్తి-కోహెడ ప్రధాన రహదారిపై ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఒగులాపూర్‌ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రేకొండ ఊర చెరువు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెద్దమ్మపల్లె, బండారుపల్లె ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయి. మండల ప్రత్యేకాధికారి బాల సురేందర్‌, తహసీల్దార్‌ అహ్మద్‌, ఎంపీడీవో ఖాజా మొయినొద్దీన్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.