గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 21, 2020 , 02:14:22

మరో 16రోజులు లాక్‌డౌన్‌

మరో 16రోజులు లాక్‌డౌన్‌

వేములవాడ : కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో మరో 16రోజుల పాటు పట్టణంలో లాక్‌డౌన్‌ పాటించేలా నిర్ణయించినట్లు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మధు రాజేందర్‌ తెలిపారు. గురువారం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం పట్టణంలో కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని లాక్‌డౌన్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. పుల్కం రాజు, కౌన్సిలర్‌ శంకర్‌, నాయకులు ఉమేందర్‌గౌడ్‌, పులి రాంబాబుగౌడ్‌, ముప్పిడి శ్రీధర్‌ ఉన్నారు.