శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 20, 2020 , 03:33:51

‘కల్యాణ’ కానుక

‘కల్యాణ’ కానుక

  • n పండుగలా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
  • n 332మందికి అందజేత
  • n సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు

సిరిసిల్ల టౌన్‌: తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కు అండగా ఉంటున్నది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా వారి వివాహాలకు లక్షనూట పద హార్లు అందజేస్తున్నది. జిల్లా కేంద్రంలోని పొదుపు భవనంలో మున్సిపల్‌ పరిధిలోని 332మంది లబ్ధిదా రులకు అధికార యంత్రాంగం బుధవారం చెక్కులు పంపిణీ చేసింది. మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ ఆధ్వర్యంలో 39 వార్డులకు చెందిన లబ్ధిదారులకు తహసీల్దార్‌ అంజన్న పర్యవేక్షణలో చెక్కులు అందజేశారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఆడబిడ్డల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి పథకంతో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పెద్దదిక్కు అయ్యారని, ఆయన మేలు మరవబో మని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్ర పాణి, రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ పాలకవర్గ సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.