శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 19, 2020 , 02:43:27

ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే

ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే

  • చరిత్రకారులకు ప్రత్యేక గుర్తింపు
  • lబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి  పర్శ హన్మాండ్లు   
  • lఘనంగా సర్వాయి పాపన్న జయంతి 

సిరిసిల్ల : బహుజన చరిత్రకారులకు సీఎం కేసీఆర్‌తోనే ప్రత్యేక గుర్తింపు లభించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బహుజన చరిత్రకారులకు ఏ ప్రభుత్వం కూడా కనీస గుర్తింపు ఇవ్వలేదని, తెలంగాణ సాధన తర్వాత సీఎం కేసీఆర్‌తోనే చరిత్రకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. సర్వాయి పాపన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంలో పొందుపర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కందుకూరి రామాగౌడ్‌, కంచర్ల రాజు, మచ్చ యశ్వంత్‌ నేరెళ్ల అనిల్‌గౌడ్‌, కాసారపు రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబాద్‌: మండల కేంద్రంలో గౌడ సంఘం నాయకులు వేముల రవీందర్‌గౌడ్‌, గుండెల్లి శ్రీనివాస్‌గౌడ్‌, బుర్ర రామాగౌడ్‌, వంగ రామా గౌడ్‌, భూంపెల్లి శ్రీనివాస్‌గౌడ్‌, సత్యనారాయణ గౌడ్‌ ఆధ్వర్యంలో  జయంతి వేడుకలు నిర్వహించారు. 

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంతోపాటు వెంకటాపూర్‌లో గౌడ సంఘం నాయకులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కదరె భాస్కర్‌ గౌడ్‌, స ర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, ఎల్లాగౌడ్‌, కిషన్‌ గౌడ్‌, ముష్కం దత్తాద్రి గౌడ్‌, బొల్గం రంగా గౌడ్‌, ప్రదీప్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

గంభీరావుపేట : మండల కేంద్రంతోపాటు కొత్తపల్లి, లింగన్నపేటలో పాపన్నగౌడ్‌ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ్యులు బాలరాజు గారి దేవాగౌడ్‌, రవి గౌడ్‌, చంద్రా గౌడ్‌, బాలాగౌడ్‌, తదితరులు ఉన్నారు.

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లిలో సర్వాయి పాప న్న చిత్రపటానికి గౌడ సంఘం నాయకులు పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. జిల్లెల్లలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రగుడులో గౌడ యూత్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమాల్లో నేరెళ్ల సింగిల్‌ విండోచైర్మన్‌ భాస్కర్‌గౌడ్‌, మండల గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌ గౌడ్‌, కే రామాగౌడ్‌, ఎస్‌ రామచంద్రం గౌడ్‌, కే ఆంజనేయులు, నాం పల్లి, అనిల్‌కుమార్‌, అజయ్‌, కొత్త రవి, బీ దేవ య్య, లక్ష్మీపతి, ఎస్‌ రాజు, శ్రీనివాస్‌, గణేశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సంతోష్‌, రాజు, రమేశ్‌, సురేశ్‌, సతీశ్‌, కిషన్‌ భానుచందర్‌, రగుడు గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్‌ సభ్యులు ఉన్నారు.

సిరిసిల్ల టౌన్‌: పట్టణంలో గౌడ యువజన సంఘం పట్టణాధ్యక్షుడు నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద పాపన్న చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బండారి శ్రీనివాస్‌ గౌడ్‌, రాజు గౌడ్‌, చరణ్‌గౌడ్‌, ప్రదీప్‌గౌడ్‌, నారాయణగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఇల్లంతకుంట : మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో గౌడ సంఘం నాయకుడు వైస్‌ ఎంపీ పీ శ్రీనాథ్‌గౌడ్‌ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో సర్పంచ్‌ ముత్యం అమర్‌, ఎంపీటీసీ నాయిని స్రవంతి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వెంకటేశం, నా యకులు, రమేశ్‌, దేవెందర్‌, సూర్య, శ్రీనివాస్‌, భాస్కర్‌, కిరణ్‌, సత్తయ్య, శ్రీహరి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్‌, కొలనూర్‌తోపాటు పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించా రు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. 

చందుర్తి: మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో  గౌడ కులస్థులు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

వేములవాడ: పాపన్న జయంతిని వేములవాడలో గౌడ కులస్థులు, సంఘం జిల్లా అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు.  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, బీజేపీ పట్టణాధ్యక్షుడు రేగుల సంతోశ్‌బాబు, నాయకులు స్వామిగౌడ్‌, బుర్ర శేఖర్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు. 

వేములవాడ రూరల్‌ : వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని శాత్రాజుపల్లి, మండలంలోని రుద్రవరం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ ఊరడి రాంరెడ్డి, ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ, గౌడ సంఘం నాయకులు కనుకయ్య, శ్రీనివాస్‌, కనుకయ్యతోపాటు ఉపాధ్యాయ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు సలీం, నాయకులు చేపూరి నర్సయ్య, పులి సంపత్‌, దాచారం నాగరాజు, విక్కుర్తి శ్రీనివాస్‌, నాగల సురేష్‌, హరీశ్‌, ప్రశాంత్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.