శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 18, 2020 , 02:59:01

జాలర్లు చేపల వేటకు వెళ్లద్దు..

జాలర్లు చేపల వేటకు వెళ్లద్దు..

చింతలమానేపల్లి : భారీ వర్షాల నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు సూచించారు. మండలంలోని దిందా - కేతిని వాగు, గూడెం అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద ప్రాణహిత నదిని పరిశీలించారు. రుద్రాపూర్‌, లంబడిహేటి గ్రామాల్లో కూలిన రెండు ఇండ్లను జడ్పీ సీఈవో వేణు పరిశీలించారు. మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. తహసీల్దార్‌ బికర్ణదాస్‌, ఎంపీపీ డుబ్బుల నానయ్య, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, ఎంపీడీవో రమేశ్‌రెడ్డి, ఎంపీటీసీ ధన్‌రాజ్‌, సర్పం చ్‌లు, నాయకులు ఉన్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

సిర్పూర్‌(టి): మండలంలోని పెన్‌గంగ నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండా లని కుమ్రం భీం జిల్లా అదనపు కలెక్టర్‌ పీ రాం బాబు సూచించారు. మండలంలోని వెంకట్రావ్‌పేట్‌ గ్రామ సమీపంలోని పోడ్సా అంతర్రాష్ట్ర వంతెన వద్ద పెన్‌గంగ నది వరద ఉధృతిని ఆయ న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. మండలంతోపాటు మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తున్నదని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్థానికంగా ఉంటూ పరిస్థితి ని సమీక్షించాలని ఆయన సూచించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ లింగమూర్తి, అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.