బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 17, 2020 , 01:45:01

ఇంటింటికీ ఇంటర్‌నెట్‌

ఇంటింటికీ ఇంటర్‌నెట్‌

సిరిసిల్ల :  గ్రామాల్లో ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పించాలనే మంత్రి కేటీఆర్‌ సంకల్పం నేరవేరుతుంది.    ఆయన ఆదేశాలతో సిరిసిల్ల జిల్లాలో కేబుల్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పనికైనా ఇంటర్‌నెట్‌ తప్పనిసరి అయ్యింది. ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా క్షణాల్లో తెలుసుకోవచ్చు.  కంప్యూటర్లు, ట్యాబ్‌, మొబైల్‌ వినియోగంతో ఇంటర్‌ నెట్‌కు డిమాండ్‌ చాలా పెరిగింది. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన ఇంటర్‌నెట్‌  గ్రామాలకూ విస్తరిస్తున్నది

పల్లె పల్లెకూ ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా పథకంలో భాగంగా ఆప్టికల్‌ ఫైబర్‌తో ఇంటర్‌ నెట్‌  సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1150 కిలోమీటర్ల మేర కేబుల్‌ వేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 500 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఆధునిక టెక్నాలజీ హెచ్‌డీడీ యంత్రంతో డ్రిల్లింగ్‌ చేస్తూ భూమిలో నుంచి కేబుల్‌ వేస్తున్నారు.  ఇంటర్‌నెట్‌ కేబుల్‌ ఉన్న గ్రామం నుంచి కేబుల్‌ లేని గ్రామాలకు గుంతలు తీస్తూ కేబుల్‌ను వేస్తున్నారు. పనులు పూర్తయ్యాక  ఆయా గ్రామపంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు అనుసంధానం చేయనున్నారు.