ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 16, 2020 , 01:54:18

కష్టకాలంలోనూ ఆగని సంక్షేమం

కష్టకాలంలోనూ ఆగని సంక్షేమం

  • n పెద్దపల్లి జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటు
  • n రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • n పెద్దపల్లిలో 74వ స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరు

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: కరోనా విపత్కర సమయంలో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ ప్రజా సంక్షేమానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం ఎటువంటి కోత విధించలేదదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం పంద్రాగస్టు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడా రు.  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, భవిష్యత్తులో పెద్దపల్లి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా తోడ్పాటు అందిస్తామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. 

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

కరోనా నేపథ్యంలో మంత్రి ఈటల ముఖ్యఅధికారులు, ప్రజాప్రతినిధులతో  చర్చించారు. వైరస్‌ విషయంలో ప్రజలు ఆందోళనకు గురికావద్దని, అదే సమయం లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు. ప్రజలకు వైద్యం అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని, బెడ్లు, పీపీఈ కిట్లు, మందులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, డీసీపీ రవీందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో నర్సింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌, రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, రామగుండం డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు పాల్గొన్నారు.