గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 15, 2020 , 03:42:16

వంద శాతం రుణ లక్ష్యం సాధించాలి

వంద శాతం రుణ లక్ష్యం సాధించాలి

  •  l అదనపు కలెక్టర్‌ అంజయ్య
  •  l బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం

కలెక్టరేట్‌:  జిల్లాలో 100 శాతం రుణ లక్ష్యం సాధించేలా బ్యాంకర్లు ముందుకు సాగాలని  అదనపు కలెక్టర్‌ ఆర్‌.అంజయ్య పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో వీధి విక్రయదారులకు సంబంధించి రుణాలను మంజూరు చేసేలా ముందుకు సాగాలని తెలిపారు. ఈ నెలాఖరు వరకు 100 శాతం రుణ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. జిల్లాలోని మహిళా సంఘాలకు రుణాలను మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌటిల్యారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఆర్డీఎం రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌, ఫిషరీస్‌ అధికారి కదీర్‌, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.