సోమవారం 28 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 13, 2020 , 01:54:05

అప్రమత్తతతోనే అదుపు

అప్రమత్తతతోనే అదుపు

  • n కరోనా కట్టడికి సహకరించాలి
  • n జాగ్రత్తగా ఉండాలని అధికారుల పిలుపు
  • n పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌
  • n వీధుల్లో రసాయనాలు పిచికారీ

వేములవాడ: వేములవాడ పట్టణంలోని రాజీవ్‌నగర్‌, భగవంతరావునగర్‌, గాంధీనగర్‌, కూరగాయల మార్కెట్‌ ఏరియా, తదితర ప్రాంతాల్లో మున్సిపల్‌ అధికారులు బుధవారం హైపోక్లోరైట్‌ను స్ప్రే చేయించారు. పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూనే, వైరస్‌ నియంత్రణకు ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామని ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ తెలిపారు. 

ఇల్లంతకుంట: మండల కేంద్రంలో బుధవారం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయించామని సర్పంచ్‌ కూనబోయిన భాగ్యలక్ష్మి తెలిపారు. సర్పంచ్‌ మాట్లాడుతూ, ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి వెళ్లాలన్నారు. అనంతం మండల కేం ద్రానికి చెం దిన అంతటి కార్తీక్‌కు రూ.30వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. ఇందులో ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, ఉప సర్పంచ్‌ ఎండి సాదుల్‌, కార్యదర్శి లక్ష్మణ్‌, కూనబోయిన బాలరాజు, చిట్టి ప్రదీప్‌రెడ్డి, అంతగిరి భాస్కర్‌, మామిడి తిరుపతి, రాకేశ్‌ ఉన్నారు.

వీర్నపల్లి: గర్జనపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామంలో లాక్‌డౌన్‌ విధించారు. నాలుగు రోజులపాటు దుకాణాలు మూసేయాలని పంచాయతీ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఎవరైనా మాస్క్‌ లేకుండా బయట తిరిగితే రూ.500 జరిమానా విధిస్తామని సర్పంచ్‌ గొర్రె కరుణ తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉండడంతో సింగిల్‌విండో డైరెక్టర్‌ గజ్జెల ఆనందం హైపోక్లోరైట్‌ను విధుల్లో పిచికారీ చేశారు. 

చందుర్తి: కరోనా నేపథ్యంలో కిష్టంపేటలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సర్పంచ్‌ అంబిరి కల్పన తెలిపారు. ఈ మేరకు పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ, గ్రామంలోని హోటళ్లు, వ్యాపార సంస్థలు, కిరాణాదుకాణాలు ఉదయం 11గంటల వరకు, తిరిగి సాయం త్రం 5:30 నుంచి 7గంటల వరకు మాత్రమే తెరిచిఉంటాయన్నారు. ఇందులో కార్యదర్శి వంశీకృష్ణ, నాయకులు కొమ్ము రమేశ్‌, సత్తిరెడ్డి, అంబిరి నరేశ్‌, వాంకె శ్రీనివాస్‌ ఉన్నారు.logo