ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 13, 2020 , 01:54:07

కోరం లేక జడ్పీ సమావేశం వాయిదా

కోరం లేక జడ్పీ సమావేశం వాయిదా

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: జడ్పీ సర్వసభ్య సమావేశం కోరం లేక మరోసారి వాయిదా పడింది. బుధవారం జరగాల్సిన సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశానికి హాజరు కాలేదు. ఉదయం 11.00 గంటలకు జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, సీఈవో వెంకటమాధవరావు సమావేశ మందిరానికి వచ్చారు. అరగంట పాటు వేచి చూసినప్పటికీ వివిధ శాఖల అధికారులు తప్ప సభ్యులెవరూ హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ అధ్యక్షురాలు విజయ ప్రకటించారు. కోరం లేక మూడు నెలల క్రితం జరగాల్సిన సమావేశం కూడా ఈ విధంగానే వాయిదా పడిన విషయం తెలిసిందే. logo