శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 12, 2020 , 02:56:48

గ్రీన్‌ చాలెంజ్‌లో భాగస్వాములవ్వాలి

గ్రీన్‌ చాలెంజ్‌లో భాగస్వాములవ్వాలి

  • n  ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌ పిలుపు
  • n  ఎంపీ సంతోష్‌కుమార్‌ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటి  శుభాకాంక్షలు

బోయినపల్లి: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఇచ్చిన గ్రీన్‌ చాలెంజ్‌ను ప్రతి ఒక్కరూ స్వీకరించి మొక్కలు నాటాలని మండల పరిషత్‌ అధ్యక్షుడు పర్లపల్లి వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్‌కుమార్‌, రోహిణి  దంపతుల పెళ్లిరోజు సందర్భంగా నీలోజిపల్లి, కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, కొదురుపాక జడ్పీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ చాలెంజ్‌ భవిష్యత్‌ తరాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. జడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య మాట్లాడుతూ గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించి మండల వ్యాప్తంగా మొక్కలు నాటినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బొల్లవేణి భానుశ్రీ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లేశం, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు రజిత, అనిల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కత్తెరపాక కొండయ్య, అనుముల భాస్కర్‌, సంబ లక్ష్మీరాజం, కవ్వంపల్లి రాములు, నారాయణరెడ్డి, బాల్‌రెడ్డి, కిషన్‌, అనంతరెడ్డి, నర్సయ్య, బాలమల్లు, ఒజ్జల మహేందర్‌, కరుణాకర్‌, తిరుపతి యాదవ్‌ పాల్గొన్నారు.


logo