మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 11, 2020 , 01:16:41

పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ టెస్టులు

పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ టెస్టులు

ముస్తాబాద్‌: కరోనా లక్షణాలు ఉన్నవారు ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. పోత్గల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవాలాల్‌తండాకు చెందిన పావనికి సారణ ప్రసవం జరుగగా, ఆమెకు వైద్యాధికారి సంజీవరెడ్డితో కలిసి కేసీఆర్‌ కిట్‌ అందజేసి, మాట్లాడారు. సర్కారు దవాఖానలకు పేదలు అధికంగా వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేసిన పథకాలతోపాటు కేసీఆర్‌ కిట్లతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. పీహెచ్‌సీ పరిధిలో నాలుగు నెలల్లోనే 38ప్రసవాలు జరిగాయని తెలిపారు. 

పరీక్షలు చేయించుకోవాలి

కరోనా నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుమానితులకు ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. వైద్య సిబ్బందితోపాటు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో ప్రజలకు వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నవారు వైద్యుల సూచనలు పాటిస్తూ, హోం క్వారంటైన్‌ లో ఉండాలన్నారు. డాక్టర్‌ సంజీవరెడ్డి సిబ్బంది ఉన్నారు.

బోయినపల్లి: బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ర్యాపిడ్‌ టెస్టుల కేంద్రాన్ని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ, జడ్పీటీసీతోపాటు ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, ఎంపీవో గంగాతిలక్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆరీఫ్‌, టెలికాం జేఈ శ్రీనివాస్‌ రెడ్డి, పీఆర్‌ఏఈ యాదగిరి, నాయకులు కత్తెరపాక కొండయ్య, సం బ లక్ష్మీరాజం టెస్టులు చేయించుకోగా, రిపోర్టులో నెగిటివ్‌ వచ్చిం ది. ఇందులో వైద్యులు శ్రీఖర్‌, సౌమ్య, ల్యాబ్‌ టెక్నీషియన్‌ విజయేందర్‌, సిబ్బంది లింగంకుమార్‌ ఉన్నారు.

ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరో గ్య కేంద్రంలో కరోనా(ర్యాపిడ్‌) పరీక్షలు చేస్తున్నామని మండల వైద్యాధికారి తిరుమల ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. సోమవారం 9మందికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. లక్షణా లు ఉన్నవారి పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 125మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి సంతోష్‌ తెలిపారు. వెంటనే హోం ఐసొలేషన్‌కు వెళ్లాలని, వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారు సైతం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

ఆరోగ్య కిట్ల పంపిణీ

గంభీరావుపేట: మండల ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యు లు, సిబ్బందికి కాంగ్రెస్‌ నేత చీటి ఉమేశ్‌రావు సోమవారం కరోనా నివారణ కిట్లు అందజేశారు. 100 పీపీఈ కిట్లు, శానిటైజేషన్‌, మాస్కులు, గ్లౌస్‌లు పంపిణీ చేశారు. ఇందులో ఎంపీటీసీ ఈడిగ పరశురాములు, నేతలు శ్రీనివాస్‌రెడ్డి, తాజొద్దీన్‌, నర్సింహులు, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. 

అప్రమత్తంగా ఉండాలి

ఎల్లారెడ్డిపేట: కరోనా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి ధర్మానాయక్‌ సూచించారు. సోమవారం ఆయన పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు నిర్వహించి, మాట్లాడారు. మండల వ్యాప్తంగా మరో 12పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు చెప్పా రు. హోం ఐసొలేషన్‌లో ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


logo