మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 09, 2020 , 01:20:57

మెరుగైన వైద్య సేవలు అందించాలి

మెరుగైన వైద్య సేవలు అందించాలి

సిరిసిల్ల టౌన్‌: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ కోరారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత దవాఖానను మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళతో కలిసి ఆమె ప్రారంభించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చిక్కాల రామారావు, గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

వీధి వ్యాపారులకు రుణాలు

వేములవాడ: కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వీధి వ్యా పారులు ఆత్మ నిర్భర్‌ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్‌ అధికారులు కోరారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో చిన్నతరహ వ్యాపారం చేస్తున్న వీధి విక్రయదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. అధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ పత్రాలతోపాటు సంబంధిత వ్యాపారానికి సంబంధించిన ఫొటో, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం వేములవాడ పురపాలక సంఘంలోని మెప్మా విభాగానికి చెందిన అశోక్‌(9885717892), కల్యాణి (8790652771), జ్యోతి (76599-50005), మమత (9573643385)ను సంప్రదించాలని తెలిపారు.


logo