శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 07, 2020 , 03:52:07

కరోనా బాధితులకు మెరుగైన వైద్యమందించాలి

కరోనా బాధితులకు మెరుగైన వైద్యమందించాలి

  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజేందర్‌

జగిత్యాల, నమస్తే తెలంగాణ : కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని   రాష్ట్ర వైద్య ఆ రోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వైద్య సిబ్బందికి సూచించారు.    ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, జిల్లా ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిబ్బంది కొరత ఉన్న జిల్లా, ఏరియా, మెడికల్‌ కళాశాలల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలన్నారు. నియామక కమిటీలకు  కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారన్నారు. కొవిడ్‌ బాధితులకు చికిత్సనందించేందుకు  ప్రైవేటు దవాఖానల సేవలను  వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రా ల్లో 50నుంచి 100 మందికి చికిత్సనందించేలా ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆక్సిజన్‌ కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయి హోం ఐసొలేషన్లలో ఉన్నవారికి మెడికల్‌ కిట్లను అందజేయాలని  సూచించారు. కరోనాతో ఎలాంటి ప్రాణాపాయంలేదనే విషయంపై ప్రజలకు వివరించాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ పాజిటివ్‌ బాధితులకు మెడికల్‌ కిట్‌లను అందించడంతో పాటు వారికి తగిన సలహాలు, సూచనలు అందించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న కొవిడ్‌ నిర్ధ్దారణ టెస్టింగ్‌ కేంద్రాలు సరిపోవడం లేదని బావిస్తే మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్‌ -19 చికిత్సకు పెండింగ్‌ బిల్లులు ప్రోఫార్మాలో సమర్పించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ రవీ, అదనపు కలెక్టర్‌ రాజేశం, అరుణశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీధర్‌, సుదక్షిణాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మనిర్భర్‌ ద్వారా ఆర్థిక సాయం చేయాలి...

 చిన్న, మధ్యతరహా వ్యాపారులను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కలెక్టర్లు, బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం సీఎస్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఆపత్కాలంలో నష్టపోయిన వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. క్రెడిట్‌ గ్యా రెంటీ స్కీం ఫర్‌ సబార్డినేట్‌ డేబిట్‌ కింద అర్హత గల సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల జాబితాను అందించాలని బ్యాంకర్లను కోరారు.  


logo