ఆదివారం 06 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 07, 2020 , 03:52:10

రైతు వేదికలు వేగంగా నిర్మించాలి

రైతు వేదికలు వేగంగా నిర్మించాలి

  • n అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌
  • n పనుల పరిశీలన

వీర్నపల్లి: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రైతు వేదికలను వేగవంతంగా నిర్మించాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థల) సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ సొంత ఖర్చులతో నిర్మిస్తున్న రైతు వేదికను రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తుదిదశకు చేరుకున్న పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కాగా ఈ నెల 8న మంత్రి కేటీఆర్‌ రైతు చర్చా వేదికను ప్రారంభించడానికి వీర్నపల్లికి వస్తున్నారని తెలిపారు. ఆయన వెంట శిక్షణ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ ఎడ్ల సాగర్‌, డీఏవో రణధీర్‌రెడ్డి, తహసీల్దార్‌ మజీద్‌, ఎంపీడీవో భారతి, ఏవో భూంరెడ్డి, ఎంపీవో నరేశ్‌, సర్పంచులు దినకర్‌, జవహార్‌, ఉప సర్పంచ్‌ రవి, నాయకులు సురేశ్‌, జగన్‌, లక్ష్మీనారాయణ ఉన్నారు.

వేదిక పరిశీలన

బోయినపల్లి: బోయినపల్లిలోని రైతు వేదికను అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థల) సత్యప్రసాద్‌ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.  మంత్రి కేటీఆర్‌తో చేతులమీదుగా ఈ నెల 8న రైతు వేదికను ప్రారంభించేందుకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వేదికను ఆయన పరిశీలించి పనుల్లో నాణ్య తా ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, శిక్షణ కలెక్టర్‌ రిజ్వానాబాషా, డీపీవో రవీందర్‌, డీఏవో రణధీర్‌, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, నాయకులు గుంటి శంకర్‌, ఈడ్గు స్వామి తదితరులు ఉన్నారు.