బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 06, 2020 , 02:40:03

రామన్న అభయం

రామన్న అభయం

  • l నలుగురు దివ్యాంగులకు అమాత్యుడి భరోసా
  • l సొంత నిధులతో త్రివీలర్‌ స్కూటర్లు కొనుగోలు 
  • l లబ్ధిదారులకు అందజేసిన టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి 

ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ.. నిరుపేదలకు బాసటగా నిలిచే మంత్రి కేటీఆర్‌ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో నలుగురు నిరుపేద దివ్యాంగులకు అభయమిచ్చారు. తన సొంత నిధులు రూ.4లక్షలతో నాలుగు త్రీవీలర్‌ స్కూటర్లు సమకూర్చి, బుధవారం టెస్కాబ్‌ చైర్మన్‌ చేతులమీదుగా అందజేయగా

లబ్ధిదారులు మురిసిపోయారు.  

సిరిసిల్ల రూరల్‌/సిరిసిల్ల టౌన్‌: తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెకు చెందిన సోమిరెడ్డి రాజు, ఎల్లారెడ్డిపేటకు చెందిన మహేందర్‌, సిరిసిల్ల పట్టణానికి చెందిన పరశురాంగౌడ్‌, ఇల్లంతకుంటకు చెందిన పల్లె ఏల్లయ్య నిరుపేదలు. ఏదో చిన్నపాటి పనులు చేసుకొని కుటుంబాలు పోషించుకుంటున్నారు. అయితే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు కావడం, ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో త్రివీలర్‌ కోసం  మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 

అమాత్యుడి భరోసా..

స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తన సొంత నిధులు రూ. 4లక్షలతో నాలుగు త్రివీలర్‌ స్కూటర్లు సమకూర్చగా, బుధవారం సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ కార్యాలయంలో నలుగురికి టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అందించి, ప్రారంభించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళ, తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, జడ్పీ సభ్యురాలు పుర్మాణి మంజులతో కలిసి స్కూటర్లను దివ్యాంగులకు అందజేయగా, నలుగురు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌సార్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. సహకరించిన ప్రజాప్రతినిధులకు,నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.