మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 05, 2020 , 01:58:28

నాటిన మొక్కలను సంరక్షించాలి

నాటిన మొక్కలను సంరక్షించాలి

  • n నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 
  • n మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ

సిరిసిల్ల టౌన్‌: హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ నుంచి పెద్దూరు రోడ్డులో హరితహారం మొక్కలు, ఫుట్‌పాత్‌ పనులను మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడా రు. హరిత తెలంగాణ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మున్సిపల్‌ పరిధిలో హరితహారం విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. సాయినగర్‌ శివారులో ప్రధాన రహదారి వెంట నాటిన మొక్కలు ఎండిపోవడంతో మున్సిపల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది బాధ్యతగా పని చేసి మొక్కలను కాపాడాలని సూచించారు. అదే విధంగా ఫుట్‌పాత్‌ పనులు మధ్యలో వదిలేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి వెంటనే పనులు పూర్తి చేయాలని కమిషనర్‌ సమ్మయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo