శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 05, 2020 , 01:58:29

‘పాడి’ రైతుకు ప్రాధాన్యం

‘పాడి’ రైతుకు ప్రాధాన్యం

జీవాలకు ఆవాసం కోసం షెడ్లు n దరఖాస్తు చేసుకున్న అన్నదాతలు n ‘ఈజీఎస్‌' ద్వారా త్వరలోనే నిర్మాణం  n సర్వత్రా హర్షం

తెలంగాణ ప్రభుత్వం పాడి రైతులకు ప్రాధాన్యమిస్తున్నది. అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పాడి పరిశ్రమపై దృష్టిసారించింది. చలి, ఎండ, వాన బారినుంచి జీవాలకు రక్షణ కల్పించే విధంగా ఆవాసం కల్పించనున్నది. ఇందు కోసం ఉపాధిహామీ పథకం ద్వారా షెడ్లు నిర్మించనున్నది. ఇప్పటికే పలువురు రైతులు షెడ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, త్వరలోనే పనులు ప్రారంభించనున్నది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

- బోయినపల్లి

రైతులు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను నమ్ముకున్నారు. పొద్దంతా పొలం పనులు చేసుకుంటూ సాయం త్రం పశువులను సాకుతూ కాలం వెల్లదీస్తున్నారు. అయితే సరైన ఆవాసం లేకపోవడంతో పశువులు రోగాల బారినపడేవి. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జీవాలకు ఆవాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అర్హులైన రైతులను ఎంపిక చేసి ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల కోసం షెడ్లు నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే పలువురు రైతులు దరఖాస్తు చేసుకోగా, త్వరలోనే షెడ్లు నిర్మించనున్నారు. 

దరఖాస్తు చేసుకున్న రైతులు

ప్రభుత్వం షెడ్ల నిర్మాణానికి చేయూతనివ్వడంతో రైతు లు నిర్మించుకొనేందుకు ముందుకు వస్తున్నారు. మండలం లో ఇప్పటి వరకు 170మంది గొర్రెలు, మేకల పెంపకం దారులు, 190మంది పాడి రైతులు షెడ్లు నిర్మించుకొనేం దుకు గాను దరఖాస్తు చేసుకున్నారు. ఈజీఎస్‌ ద్వారా షెడ్ల నిర్మాణంతోపాటు, గడ్డి, నాటుకోళ్ల పెంపకం కోసం ప్రభు త్వం ఆర్థిక సాయం అందించనున్నది. ఇందు కోసం రెవె న్యూ, మండల పరిషత్‌, పశు వైద్యాధికారులు సంయు క్తంగా లబ్ధిదారులను ఎంపిక చేసి సాయం అందించను న్నా రు. తహసీల్దార్‌ దార ప్రసాద్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, పశు వైధ్యాధికారులు రమేశ్‌, రామచంద్రుడు ఇప్పటికే గ్రామాల్లో షెడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. 

వివరాలు ఇలా..

ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించే షెడ్లు, పశుగ్రాసం కోసం చెల్లించే నగదు వివరాలు ఇలా ఉన్నాయి. పశువుల షెడ్డు కోసం 57,087, గొర్రెలు, మేకల షెడ్డు కోసం(100 లోపు జీవాలు ఉంటే ) 54,140, వంద పైన ఉంటే 90,490, నీటి తొట్టి నిర్మాణం కోసం 19,829, పశువులకు నీటితొట్టి నిర్మాణం కోసం 23,256, పశు గ్రాసం పెంపకం కోసం (ఐదుసార్లు) 34,352, ఒకేసారి పశుగ్రాసం పెంపకం కోసం 13,192, అజోల్ల పెంపకం కోసం 6,449, కోళ్లఫారం షెడ్డు కోసం 38, 344, నాడేఫ్‌ కంపోస్ట్‌ ఫిట్‌ ( ఇంటిలోని వ్యర్థాలతో ఎరువు లు తయారు చేసేందుకు) 11.993 అందించనున్నది. 

అర్హులందరికీ షెడ్లు

అర్హులైన రైతులందరికీ ఉపాధిహామీ పథకం ద్వారా షెడ్లు నిర్మిస్తాం. పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకం దారులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అందజేస్తాం. షెడ్ల నిర్మాణంతో పశువులు, గొర్రెలు, మేకలకు వాన, చలి నుంచి రక్షణ ఉంటుంది. రైతులందరూ తప్పకుండా షెడ్లు నిర్మించుకోవాలి. 

               - డా.రమేశ్‌, పశు వైద్యాధికారి, బోయినపల్లిlogo