బుధవారం 30 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 04, 2020 , 02:32:51

రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు

రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు

వేములవాడ కల్చరల్‌: శ్రావణ సోమవారం, రాఖీ పౌర్ణ మి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న 68 మంది భక్తులకు స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో అభిషేక, అన్న పూజలు, నాగిరెడ్డి మండపంలో కుంకుమ పూజలు, కళాభవన్‌లో నిత్య కల్యాణం, చండీహవనం, సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు. ఇందులో అర్చకులు చంద్రగిరి శరత్‌, ప్రతా ప శ్రీనివాస్‌, మామిడిపెల్లి శరత్‌, ఉపాధ్యాయులు సంతోష్‌, కృపాల్‌, గోపన్నగారి చందు, బుడెంగారి మహేశ్‌, పారువెళ్ల శ్రీనాథ్‌ ఉన్నారు.

యజుర్వేద ఉపాకర్మ

రాజన్న ఆలయంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో యజుర్వేద ఉపాకర్మ నిర్వహించా రు. అర్చకులు వేదమంత్రాలతో ఉపాకర్మను నిర్వహిస్తుండగా, పట్టణంలోని బ్రాహ్మణులు యజ్ఞోపవీతధారణ గావించారు. ఇందులో ఆలయ ప్రధానార్చకులు ఈశ్వరగారి సురేశ్‌, చంద్రగిరి శరత్‌, గోపన్నగారి నాగ న్న, గణేశ్‌, మామిడిపెల్లి శరత్‌ ఉన్నారు.

తాజావార్తలు


logo