బుధవారం 23 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 04, 2020 , 02:32:47

ఘనంగా నూలు పూర్ణమి

ఘనంగా నూలు పూర్ణమి

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లిలో నూలు పౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. మండలకేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక శివభక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలీలు, నాయకులు ప్రత్యేక పూజ లు చేశారు. నూలు పౌర్ణమిని పురస్కరించుకొని జంజిరాలు ధరించారు. సాయంత్రం  మార్కండేయుడి విగ్రహాంతోపాటు చేనేత మగ్గంతో రథయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోర శ్రీహరి, మచ్చ ఆంజనేయులు, సామల రమేశ్‌,  మాజీ సర్పం చ్‌ అంకారపు రవీందర్‌, మచ్చ శ్రీనివాస్‌, రామకృష్ణ , మోర రాజు, రాపెల్లి ఆనందం, అంకారపు మహేశ్‌, సాయికృష్ణ, బండారి శ్రీనివాస్‌, నవీన్‌ తదితరులు ఉన్నారు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు.logo