బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 03, 2020 , 01:23:56

పరమ పవిత్రం ..శ్రావణ పౌర్ణమి

పరమ పవిత్రం ..శ్రావణ పౌర్ణమి

వేములవాడ కల్చరల్‌: హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న మాసం శ్రావణం. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి సంబంధించి ఇతిహాసాల్లో అనేక ఘట్టాలు ఉన్నాయి. అయితే చాలా మందికి రాఖీ పౌర్ణమిగానే తెలుసు. శచీదేవి దేవేంద్రుడికి విజయప్రాప్తి సిద్ధించాలని శ్రావణ పూర్ణిమనాడు రక్షాబంధనం కట్టింది. అప్పటినుం చి ఈ రోజును ప్రజలు రౌఖీ పౌర్ణమిగా జరుపుకుంటున్నారు. అనేక పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. 

సోదర ప్రేమకు ప్రతీక..

రాఖీ పౌర్ణమిని సోదర ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఇరవై, ముప్పై ఏళ్ల కిందట ఉత్తర భారతంలోనే ఈ పండుగను జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైభవంగా చేసుకుంటున్నారు. రక్షా బంధన్‌ అన్నాచెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్ల మధ్య బంధాన్ని బలపరుస్తుందని ప్రతీతి. అంతేకాకుండా ఒకరి శ్రేయస్సును మరొకరూ కాంక్షిస్తూ తమ సోదరీమణులు రాఖీ కడతారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు -ద్రౌపది, చంద్రుడు-లక్ష్మీదేవి, చరిత్రలో అలెగ్జాండర్‌, హుమాయూన్‌ వంటి ప్రముఖుల జీవితాల్లో చోటుచేసుకున్న ఘటనలను సోదరీమణుల విశిష్టత రక్షాబంధన్‌ను గుర్తుకుతెస్తుంది. 

జంధ్యాల పూర్ణిమ..

శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. ఈరోజు హిందువుల్లోని కొన్ని వర్గాలు జంధ్యాలను మార్చుకునే సంప్రదాయం ఉంది. యజ్ఞోపవీతధారణ అత్యంత ప్రముఖం గా నిర్వహించుకునే కార్యక్రమం.

నేడు లక్ష్మీ హయగ్రీవస్వామి జయంతి.. 

శ్రావణ పౌర్ణమిరోజున విద్యలకు అధిపతియైన లక్ష్మీహయగ్రీవస్వామి అవతరించాడని పెద్దలు చె బుతారు. శ్రావణ పౌర్ణమి రోజు, శ్రవణా నక్షత్రం రోజున వైష్ణవాలయాల్లో లక్ష్మీహయగ్రీవస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. తద్వారా చక్కని విజ్ఞానం లభిస్తుందని పండితులు పేర్కొంటారు.