బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 02, 2020 , 02:32:21

పేదలకు అండగా ప్రభుత్వం

పేదలకు అండగా ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వా రా ఆరుగురికి మంజూరైన చెక్కులను శనివారం ఆమె నివాసంలో కౌన్సిలర్లతో కలిసి పంపిణీ చేశారు. 21వ వార్డుకు చెందిన పూజకు 23వేలు, 17వ వార్డుకు చెందిన సత్యం కు 12,500, అక్షయకు 30వేలు, రాజ్యలక్ష్మికి 60 వేలు, మాధవికి 26వేలు, 36వ వార్డుకు చెందిన నక్క రమాదేవికి 20,500 విలువైన చెక్కులను అందజేశారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వం పేదలకు వైద్య సేవలు అందు బాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఇందులో కౌన్సిలర్లు గుండ్లపల్లి నీరజ, వేముల రవి, కల్లూరి రాజు ఉన్నారు. 

గంభీరావుపేట: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరు పేదలకు వరంలా మారిందని ఎంపీపీ వంగ కరుణ పేర్కొ న్నారు. కొత్తపల్లిలోని పంచాయతీ కార్యాలయంలో శనివా రం ఆమె ఆరుగురికి మంజూరైన 2.2లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.  అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. సర్పంచ్‌ అక్క పల్లి స్వరూప, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు దేవయ్య, ఎస్‌ ఎంసీ చైర్మన్‌ పెద్దూరి దేవాగౌడ్‌, నేతలు వంగ సురేందర్‌ రెడ్డి, అక్కపల్లి రాజనర్సింహరెడ్డి, బాల్‌రెడ్డి, సంజీవ్‌, బట్టు ప్రవీణ్‌, మహేశ్‌, రాజనర్సు, జగన్‌, మహేందర్‌ ఉన్నారు. 

ఎల్లారెడ్డిపేట: బొప్పాపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి 1.20లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అక్కపల్లిలో సర్పంచ్‌ ముక్క మధుకర్‌ ముగ్గురికి 1.37లక్షలు, గుం డారంలో సర్పంచ్‌ శంకర్‌నాయక్‌ ముగ్గురుకి 1.15 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు బొమ్మనవేని కృష్ణ, భూపతి, గుంటి పరశు రాములు, వైస్‌ ఎంపీపీ కదిరె భాస్కర్‌, నాయకులు ఇల్లెం దుల శ్రీనివాస్‌రెడ్డి,  ఉప సర్పంచ్‌ గోగూరి ప్రదీప్‌రెడ్డి, ముత్యాల శేఖర్‌రెడ్డి, గునిగంటి చిరంజీవి పాల్గొన్నారు.

సిరిసిల్ల రూరల్‌: సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా తంగళ్లపల్లి మండ లం ఇందిరమ్మకాలనీలో దూస మహేందర్‌కు 11,500, పిట్ల రాజుకు 25వేలు, బి.లక్ష్మికి 48,500 మంజూరు కాగా, సదరు చెక్కులను స్థానిక నేతలతో కలిసి సర్పంచ్‌ బైరి శ్రీవాణి లబ్ధిదారులకు అందజేశారు. ఎంపీటీసీ సిలువేరి ప్రసూన, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు సాదుల భాస్కర్‌, బైరి రమేశ్‌, ఉప సర్పంచ్‌ సాయిరాం, సామల సరస్వతి, గోరిటా ల భాగ్యలక్ష్మి, రాజేశ్‌, నర్సయ్య, ఏర్ల సంధ్య ఉన్నారు.