సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 31, 2020 , 01:35:46

ప్రకృతివనం పచ్చగా ఉండాలి

ప్రకృతివనం పచ్చగా ఉండాలి

సైదాపూర్‌ : పల్లె పకృతివనం చెట్లతో నిండి పచ్చగా ఉండాలని డీఆర్‌డీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని దుద్దనపల్లిలో పల్లెపకృతివనంలో ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో మాట్లాడుతూ పకృతివనంలో 2 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి పెంపకంపై కూడా దృష్టిసారించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రవీందర్‌, సర్పంచ్‌ తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, ఎంపీటీసీ చాడ చైతన్య, ఉప సర్పంచ్‌ పోతిరెడ్డి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఏపీవో శోభ, గ్రామ కార్యదర్శి సుష్మ, సీసీ అనపురం రమేశ్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.  

30వ వార్డులో హరితహారం

జమ్మికుంట : మున్సిపల్‌ పరిధిలోని 30వ వార్డులో వార్డు కౌన్సిలర్‌ మద్ది లావణ్య ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ దేశిని స్వప్న, కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీల్లో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడారు. హరితహారంలో అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల సకల జీవకోటికి ఆధారమని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో  కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్‌, పొనగంటి మల్లయ్య, రావికంటి రాజు, దిడ్డి రాము, స్థానిక నాయకుడు కోటి తదితరులు ఉన్నారు.