శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 31, 2020 , 01:35:58

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై	అప్రమత్తంగా ఉండాలి

  •   n  జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు  దావ వసంత
  • n  అధికారులతో సమీక్షా సమావేశం

జగిత్యాల: పల్లెలో ప్రకృతి వనాల పనులు వేగవంతం చేయాలని జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పల్లె ప్రకృతి వనాలు, జిల్లా అభివృద్ధి పనులపై గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ, పట్టణంలో పార్కుల మాదిరిగా గ్రామాల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రకృతి వనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో వీటి పనులు చేపట్టేలా మండల అభివృద్ధి అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల తో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఎంపీడీవోలను ఆదేశించారు. గ్రామాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైట్‌ ద్రావణం అందుబాటులో ఉంచాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇంకుడు గుంత లు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మా ణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాలని, ప్రతి ఎంపీడీవో గ్రామ సభలకు విధిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. మాస్కులు ధరించకపోతే జరిమానా వేయాలని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో శ్రీలతరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శేఖర్‌, డీఆర్డీఏ ఏపీడీ సంధ్యారాణి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.