శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jul 31, 2020 , 01:36:40

హోంగార్డుల ఔదార్యం

హోంగార్డుల ఔదార్యం

  • n  హోంగార్డు దేవయ్య కుటుంబానికి ఒకరోజు వేతనం.. 
  • n  రూ.1.68లక్షల చెక్కును  అందించిన ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 228 మం ది  హోంగార్డులు తమ ఔదార్యాన్ని చాటారు. వి వరాలిలా ఉన్నాయి. సిరిసిల్లలో లాక్‌డౌన్‌ సమయంలో విధులు నిర్వహిస్తూ సిలువేరి దేవయ్య అనే హోంగార్డు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో హోంగార్డులంతా తమ ఒకరోజు వేతనం రూ.1.68లక్షలను దేవయ్య కుటుంబానికి ఎస్పీ రాహుల్‌ హెగ్డే చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని తోటి హోంగార్డు కుటుంబానికి సాయంగా అందజేయ డం అభినందనీయమన్నారు. దేవయ్య కుటుంబానికి పోలీస్‌ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నదని, ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధిని సాధ్యమైనంత త్వరగా అందించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో హోంగార్డు ఇన్‌చార్జి, ఆర్‌ ఐ కుమారస్వామి, హెడ్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌, పీఎల్‌సీ దేవరాజు, హోంగార్డులు రవీందర్‌, బాలరాజు, పౌర్ణమి, కుటుంబసభ్యులు ఉన్నారు.