ఆదివారం 25 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Jul 30, 2020 , 02:11:13

బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె

బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె

  • జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
  • నివాళులర్పించిన అధికారులు,  ప్రజాప్రతినిధులు

వేములవాడ రూరల్‌/వేములవాడ కల్చరల్‌/చందుర్తి/ సిరిసి ల్ల రూరల్‌: జ్ఞానపీఠ అవార్డు గ్రహిత, బహుభాషా కోవిదు డు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్‌ సింగిరెడ్డి నారా యణరెడ్డి జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతిని ధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పిం చారు. స్వగ్రామమైన హన్మాజీపేటలోని ఆయన ఇంటి వద్ద పలువురు నాయకులు సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినారె భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన రాసిన రచనలు, కవితలు, పాటలు నిరం తరం ఉంటాయన్నారు. ఇందులో బుర్ర వెంకటి గౌడ్‌, డీల ర్‌ శ్రీనివాస్‌, న్యాత జార్జీ ఉన్నారు. అలాగే వేములవాడ పట్టణంలోని నృత్య కళానికేతన్‌ సేవా సంస్థ ప్రధాన కార్యా లయంలో సినారె జయంతిని నిర్వహించారు. సినారె విగ్ర హాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని, కళాకారు లకు హెల్త్‌కార్డులు అందజేయా లని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యెల్ల పోశెట్టి కోరారు. ఇందులో సంస్థ అధ్యక్షుడు కనపర్తి హన్మాం డ్లు, ప్రధాన కార్యదర్శి గంగా శ్రీకాంత్‌, గాయని రాధి, శ్రీకాం త్‌, బొడగె రాజు ఉన్నారు. చం దుర్తి మండల కేంద్రంలోని ప్రాథ మిక పాఠశాలలో హెచ్‌ఎం విక్కు ర్తి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఇందులో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాసాచారి, సంజీవ్‌కుమార్‌, యాదగిరి, లక్ష్మీ రాజం ఉన్నారు. అలాగే తంగళ్లపల్లి మండల పరిషత్‌లో ఎంపీపీ పడిగెల మానస సినారె చిత్రపటానికి పూల మాల లు వేసి నివాళులర్పించారు. ఇందులో సూపరింటెం డెంట్‌ విజేందర్‌రెడ్డి, ఫయాజ్‌, పడిగెల రాజు, నలువాల జలంధర్‌ రెడ్డి, వేల్పుల రాజు, అవదూత మహేందర్‌, మీసాల కృష్ణ, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.logo