బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jul 30, 2020 , 02:11:19

గీత కార్మికుల ఉపాధి మెరుగుకు ప్రభుత్వ తోడ్పాటు

గీత కార్మికుల ఉపాధి మెరుగుకు ప్రభుత్వ తోడ్పాటు

  • హుజూరాబాద్‌ ఆబ్కారీ  సీఐ     జీ దుర్గా భవాని 
  • కరీంపేట్‌, రాంపూర్‌ గ్రామాల్లో   హరితహారం

శంకరపట్నం: ఈత, తాటి వనాల పెంపుతో గీత కార్మికుల ఉపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తోడ్పాటు నందిస్తున్నదని హుజూరాబాద్‌ ఆబ్కారీ సీఐ జీ దుర్గా భవాని పేర్కొన్నారు. బుధవారం కరీంపేట్‌ గ్రామంలో ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా 2,600 ఈత మొక్కలు, 4,300 తాటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని తెలిపారు. వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కల్లు గీత కార్మికులకు సూచించారు. మండల ప్రత్యేకాధికారి జయశంకర్‌, సర్పంచ్‌ వనపర్తి మల్లయ్య, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, ఎక్సైజ్‌ ఎస్‌ఐ జీ రమ్య, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్‌, గౌడ సంఘం అధ్యక్షుడు కొమురయ్య, గౌడ కార్మిక సంఘం సభ్యులు, ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

హుజూరాబాద్‌ రూరల్‌: హుజూరాబాద్‌ మండలంలోని రాంపూర్‌లో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ఎక్సైజ్‌ సీఐ దుర్గాభవాని, ఎస్‌ఐ రమ్య, సర్పంచ్‌ మనోహర్‌, గౌడ సంఘం గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మానకొండూర్‌ రూరల్‌: ఊటూర్‌ గ్రామ శివారులో ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఈత, తాటి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఎలగందుల సుదర్శన్‌, ఎక్సైజ్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, గీత కార్మికులు పాల్గ్గొన్నారు. 

వివిధ గ్రామాల్లో హరితహారం

మానకొండూర్‌ రూరల్‌: మండలంలోని గంగిపల్లి, ఊటూర్‌, వెల్ది, దేవంపల్లి, పచ్చునూర్‌, ముంజంపల్లి గ్రామాల్లో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గంగిపల్లిలో మానకొండూర్‌ కేడీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పంజాల శ్రీనివాస్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ తాళ్లపల్లి సంపత్‌ గౌడ్‌, నాయకులు సాగర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటి, నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది, గ్రామస్తులు పాల్గ్గొన్నారు.

చిగురుమామిడి : హరితహారంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు బుధవారం మొక్కలు నాటారు. ఓగులాపూర్‌లో పల్లె ప్రకృతి వనంలో సర్పంచ్‌ బోయిని శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి సునీత, ఇన్‌చార్జి ఏపీవో రాజయ్య మొక్కలు నాటి, నీళ్లు పోశారు.