సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 30, 2020 , 02:11:20

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడనివారే విమర్శలు చేస్తున్నారు
  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • కొడిమ్యాల  మండల సర్వసభ్య సమావేశానికి హాజరు

కొడిమ్యాల : ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. అనవసర ఆరోపణలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ స్వర్ణలత అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్మన్‌ ద్వావ వసంతతో  కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కొడిమ్యాల మండలం ఎడారి ప్రాంతంగా ఉండేదని ప్రస్తుతం  చెరువులు కుంటలు నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం అలోచించలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం ఎంతో చేస్తున్నదని స్పష్టం చేశారు. మండల కేంద్రంలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలన్నారు. కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు రైతు బంధు రైతు బీమా పథకాలు వంద శాతం అమలవుతునట్లు చెప్పారు. జిల్లా అధికారులు మండల సమావేశానికి హాజరు కాకపోతే నోటీసులు జారీచేయాలని ఎమ్మెల్యే ఎంపీపీకి సూచించారు.    జడ్పీ చైర్మన్‌ ద్వావ వసంత మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తునట్లు చెప్పారు. అంతకు ముందు సభ్యులు మండల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. నూతనంగా సమావేశానికి వచ్చిన సింగిల్‌ విండో చైర్మన్లను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో  మల్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రవీందర్‌రావు , ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు ఉన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బుధవారం పంపిణీ చేశారు.12 మందికి 2,95,500 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు.  ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స చేయించుకొని ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా డబ్బులు మంజూరైనట్లు చెప్పారు.  అనంతరం మండల పరిషత్‌ కా ర్యా లయంలో సినారె జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ ద్వావ వసంత, ఎంపీపీ స్వర్ణలత, సింగిల్‌ విండో చైర్మన్‌ రాజనర్సింగారావు, పార్టీ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కృష్ణారావు ఉన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ 

మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన గుడి రాజవ్వ కొడిమ్యాలకు చెందిన  కొత్తూరి లస్మవ్వ పూడూర్‌కు చెందిన కత్తి సందయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సుంకె రవిశంకర్‌ బుధవారం పరామర్శించారు.  సంతాపం ప్రకటించారు. చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు.