బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 30, 2020 , 02:11:47

సినారె తెలంగాణకు గర్వకారణం

సినారె తెలంగాణకు గర్వకారణం

  • స్వరాష్ట్రంలో సాహితీవేత్తలకు సముచితస్థానం 
  • టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు
  • జిల్లా కేంద్రంలో ఘనంగా జయంతి  
  • నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు  
  • విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ 

సిరిసిల్ల టౌన్‌: సినారె మన తెలంగాణకు గర్వకారణమని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహితీవేత్తలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు.  సిరిసిల్ల మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ ఆధ్వరంలో జిల్లా కేంద్రంలోని సినారె కళామందిరంలో బుధవారం డాక్టర్‌ సీ నారాయణరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత చీటి నర్సింగరావుతో కలిసి సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితలను గుర్తించి గౌరవిస్తుందన్నారు. సినారె అంతిమయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దకొడుకులా ముందుండి శ్రద్ధాంజలి ఘటించారని గుర్తుచేశారు. విశేష ఖ్యాతి గడించిన సినారె మన జిల్లాకు చెందినవాడు గర్వకారణమన్నారు. ఆయన స్మృత్యర్థం ప్రభుత్వం జిల్లాకేంద్రంలో అధునాతన గ్రంథాలయాన్ని నిర్మిం చిందని, కళామందిరాన్ని ఆధునీకరించిందని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌరస్తాలోని సినారె జిల్లా గ్రంథాలయ ఆవరణలో విగ్రహం ఏర్పాటుకు  జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్యతో కలిసి భూమిపూజ చేశారు. అంచనా వ్యయాలను రూపొందించి ప్రణాళికాబద్ధంగా విగ్రహ ఏర్పాటు పనులు చేయాలని బల్దియా పాలకవర్గానికి సూచించారు. ఇక్కడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కమిషనర్‌ వెల్దండి సమ్మయ్య, పాలకవర్గ సభ్యులు, నాయకులు ఉన్నారు.